కృష్ణా, గోదావరి బోర్డుల మీటింగ్​కు సర్కారు డుమ్మా

  • సమావేశానికి వెళ్లని మన అధికారులు
  • ఏపీ దాదాగిరి చేస్తోందని ప్రకటించి.. మరుసటి రోజే కేసీఆర్ నిర్ణయం
  • గెజిట్‌ నోటిఫికేషన్‌లోని ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు 
  • ప్రాజెక్టుల వివరాలన్నీ కేంద్రానికే చెప్తామని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు :కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కో–ఆర్డినేషన్‌‌ మీటింగ్‌‌కు రాష్ట్ర సర్కారు డుమ్మా కొట్టింది. కృష్ణా నీళ్లపై ఏపీ దాదాగిరి చేస్తోందని సోమవారం హాలియా మీటింగ్ లో మండిపడ్డ సీఎం కేసీఆర్.. మంగళవారం జరిగిన బోర్డుల మీటింగ్​కు మాత్రం అధికారులను పంపించలేదు. దీంతో ఏపీ జల దోపిడీని ఎండగట్టే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నట్లైంది. ఇదివరకు నిర్వహించిన అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్, కేఆర్‌‌ఎంబీ త్రీమెన్‌‌ కమిటీ సమావేశాలకు కూడా మన అధికారులను పంపించలేదు. కో–ఆర్డినేషన్‌‌ మీటింగ్‌‌కు ముందు కేఆర్‌‌ఎంబీ ఫుల్‌‌ బోర్డు మీటింగ్‌‌ నిర్వహించాలని తెలంగాణ డిమాండ్‌‌ చేసింది. మంగళవారం జలసౌధలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ ప్రతినిధులు హాజరయ్యారు. జీఆర్‌‌ఎంబీ, కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ సెక్రటరీలు బీపీ పాండే, డీఎం రాయ్‌‌పురే ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఏపీ ఈఎన్సీలు నారాయణ రెడ్డి, సతీశ్‌‌, ఏపీ ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో ఎండీలు శ్రీకాంత్‌‌, శ్రీధర్‌‌ హాజరయ్యారు. 
అపెక్స్‌‌ నుంచి కో ఆర్డినేషన్‌‌ దాకా..
ఏపీ అక్రమంగా సంగమేశ్వరం చేపడుతుంటే దానిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరుడు ఆగస్టు 5న రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ నిర్వహిస్తామని సమాచారమిచ్చింది. అదే రోజున సెక్రటేరియెట్​పై చర్చించేందుకు కేబినెట్‌‌‌‌‌‌‌‌ సమావేశం పెట్టి అపెక్స్‌‌‌‌‌‌‌‌కు డుమ్మా కొట్టారు. అదేనెల 19న ఆ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయి, వర్క్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీతో అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ జరిగిపోయింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 6న నిర్వహించిన అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లినా అప్పటికే ఏపీ ప్రాజెక్టుపై దూకుడు పెంచింది. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన నీటి అవసరాలపై చర్చించేందుకు జులై 9న కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ త్రీమెన్‌‌‌‌‌‌‌‌ కమిటీ సమావేశం నిర్వహిస్తామని లేఖ రాసినా తాము రాలేమని తెలంగాణ చెప్పింది. దీంతో ఆ సమావేశం వాయిదా పడింది. కేవలం నీటి విడుదలకు సంబంధించిన అంశాలపైనే త్రీమెన్‌‌‌‌‌‌‌‌ కమిటీలో చర్చిస్తారు. ఫుల్‌‌‌‌‌‌‌‌ బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టి తమ ఎజెండాపైనా చర్చించాలని అప్పుడు తెలంగాణ పట్టుబట్టింది. కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ, జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ జ్యూరిస్‌‌‌‌‌‌‌‌డిక్షన్‌‌‌‌‌‌‌‌ల గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లోని క్లాజులపై చర్చించేందుకు మంగళవారం సమావేశం నిర్వహిస్తే దానికి డుమ్మా కొట్టింది. జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ ఫుల్‌‌‌‌‌‌‌‌ బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించాలని సోమవారం లేఖ రాసిన రాష్ట్రం, కృష్ణా బోర్డు ఫుల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టాలని మంగళవారం లెటర్‌‌‌‌‌‌‌‌ రాసింది. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు హాజరైన ఏపీ అధికారులు బోర్డులు కోరిన సమాచారమేది ఇవ్వలేదు. పైగా గెజిట్‌‌‌‌‌‌‌‌పై అభ్యంతరాలు తెలిపారు. అవన్నీ కేంద్రం దృష్టికే తీసుకెళ్తామన్నారు. తెలంగాణ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు హాజరై ఇదే విషయం చెప్తే సరిపోయేది. రెండు బోర్డులు అదే విషయాన్ని కేంద్రానికి వెల్లడించేవి. ఆ అవకాశాన్ని తెలంగాణ కోల్పోయింది.
మీకు ఏ వివరాలు ఇవ్వం: ఏపీ
జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ మెంబర్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ బీపీ పాండే మాట్లాడుతూ.. గోదావరి బోర్డు జ్యూరిస్‌‌‌‌‌‌‌‌డిక్షన్‌‌‌‌‌‌‌‌ గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లోని క్లాజుల అమలు, నిర్వహణకు సంబంధించిన యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ వివరాలు చెప్పాలని అడిగారు. ఏపీ ఈఎన్సీ బదులిస్తూ గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో చేర్చిన, చేర్చని ప్రాజెక్టులపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై త్వరలోనే కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులకు విన్నవిస్తామన్నారు. గెజిట్‌‌‌‌‌‌‌‌పై అభ్యంతరాలుంటే కేంద్రానికి చెప్పుకోవాలని, యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పాండే కోరారు. ఏపీ ప్రతినిధులు స్పందిస్తూ, కేంద్రం తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు, బోర్డుకు నిధులు, జ్యూరిస్‌‌‌‌‌‌‌‌డిక్షన్‌‌‌‌‌‌‌‌ అమలుకు సమాచారం ఇస్తామన్నారు. కేంద్రం జ్యూరిస్‌‌‌‌‌‌‌‌డిక్షన్‌‌‌‌‌‌‌‌ అమలుకు టైం ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌ ఫిక్స్‌‌‌‌‌‌‌‌ చేసిందని, దానికి అనుగుణంగా సమాచారం ఇవ్వాలని పాండే సూచించారు. ఏపీ ప్రతినిధులు స్పందిస్తూ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న ప్రాజెక్టుల పర్మిషన్‌‌‌‌‌‌‌‌లపై కాలపరిమితి అనవసరమని, దానిపై ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌ చేయాలన్నారు. అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు చెప్పాలని పాండే కోరగా, ఈ సమావేశంలో తాము ఆ వివరాలు వెల్లడించబోమని, నేరుగా కేంద్రానికే చెప్తామన్నారు. తమ ప్రభుత్వంతో మాట్లాడి ఇతర సమాచారం చెప్తామన్నారు. గెజిట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తారు. పాండే మాట్లాడుతూ, కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌ సమావేశాలు ఇకపై తరచూ నిర్వహిస్తామని తెలిపారు. కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌ సమావేశానికి ముందు ఫుల్‌‌‌‌‌‌‌‌ బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టాలని తెలంగాణ కోరిందని, ఈనెల రెండో వారంలో సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఎన్‌‌‌‌‌‌‌‌జీటీలో ఏపీ పిటిషన్‌‌‌‌‌‌‌‌
ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ ఆదేశాల మేరకు కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ బృందం గురువారం సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీం పనులను పరిశీలించనుంది. తమ పర్యటనకు నోడల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ను నియమించాలంటూ బోర్డు మెంబర్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌‌‌‌‌‌‌పురే ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావుకు లేఖ రాశారు. ప్రాజెక్టు విజిట్‌‌కు సంసిద్ధత తెలిపిన ఏపీ, కృష్ణా బోర్డు పరిశీలన బృందంలో తెలంగాణకు చెందిన వారెవరూ ఉండొద్దని మంగళవారం బోర్డుకు లేఖ రాసింది. సంగమేశ్వరం లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీం విజిట్‌‌‌‌‌‌‌‌ చేసే వారిలో తెలంగాణకు చెందిన కృష్ణా, గోదావరి బేసిన్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌ (సీడబ్ల్యూసీ డైరెక్టర్‌‌‌‌) దేవేందర్ రావు ఉన్నారని ఏపీ అభ్యంతరం తెలుపుతోంది. ఆయన్ను టీమ్ నుంచి తప్పించాలంటోంది. కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీకి లెటర్‌‌‌‌‌‌‌‌ రాయడంతోనే సరిపెట్టకుండా ఇదే విషయాన్ని పేర్కొంటూ మంగళవారం ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ చెన్నై బెంచ్‌‌‌‌‌‌‌‌లో మెమో ఫైల్‌‌‌‌‌‌‌‌ చేసింది. విచారణ ఈనెల 9న చేపట్టాల్సి ఉండగా, దేవేందర్ రావును తప్పించే విషయంలో తమ వాదనలు వినేందుకు బుధవారం అత్యవసరంగా విచారణ చేపట్టాలని గ్రీన్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ను కోరింది.
గోదావరిలోనే సమస్యలెక్కువ : ఏపీ ఈఎన్సీ
గోదావరి నీళ్ల విషయంలోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి అన్నారు. కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌ తర్వాత జలసౌధలో ఆయన మీడియాతో చిట్‌‌‌‌‌‌‌‌చాట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఉమ్మడి ఏపీకి 1,430 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, తెలంగాణ ప్రభుత్వం 1,350 టీఎంసీలు వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. అవి పూర్తయితే గోదావరి డెల్టా, పోలవరం ఆయకట్టుకు నీళ్లు ఎట్లా అని ప్రశ్నించారు. గోదావరిలో మిగులు జలాలే లేవని, ఎగువ రాష్ట్రాలు ఉపయోగించుకోని నీళ్లే సముద్రంలోకి పోతున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం క్రమశిక్షణతో పనిచేస్తుందని, వ్యవస్థలను గౌరవిస్తుందని తెలిపారు. అందుకే సమావేశానికి హాజరయ్యామన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లలో వాటా కోరుతున్న తెలంగాణ, తాను 241 టీఎంసీల గోదావరి నీళ్లు కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌కు తరలించేందుకు ఎందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుందో చెప్పాలన్నారు. సముద్రంలోకి వృథాగా నీళ్లు పోతున్నప్పుడు తాము తీసుకున్న నీటిని తమ రాష్ట్ర వినియోగం ఖాతాలో వేయాలని కోరడం సరికాదన్నారు. అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకోకుండా వదిలేసిన నీళ్లనే తాము ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. పులిచింతలలో కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి చేసి సముద్రంలోకి నీళ్లు వదిలేయడం సరికాదన్నారు. ప్రాజెక్టులన్నీ సర్‌‌‌‌‌‌‌‌ ప్లస్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి కాబట్టే తాము కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి మొదలు పెట్టామని, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తున్నామని అన్నారు. సంగమేశ్వరం నుంచి నికర జలాలు తరలించినా అవి తమ రాష్ట్రానికి చేసిన కేటాయింపులోపే ఉంటాయన్నారు. ప్రాజెక్టులకు టైం ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌లోగా పర్మిషన్‌‌‌‌‌‌‌‌లు తెచ్చుకోవాలన్న నిబంధనకు వ్యాలిడిటీ లేదన్నారు.