హైదరాబాద్, వెలుగు : తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)ను జనవరి 2 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. 10 రోజుల పాటు 20 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పరీక్షల షెడ్యూల్ను రిలీజ్ చేశారు. జనవరి 2, 5, 11, 12, 18, 19, 20వ తేదీల్లో పేపర్2 పరీక్ష, 8, 9, 10వ తేదీల్లో పేపర్1 ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ALSO READ : H1B వీసా రూల్స్ మారాయ్.. తప్పనిసరిగా స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలివే..
ప్రతిరోజూ ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకూ ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకూ సెకండ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుంది. పూర్తిస్థాయి షెడ్యూల్ను schooledu.telangana.gov.in వెబ్ సైట్లో పెట్టినట్టు పేర్కొన్నారు.