అమెరికా ఎన్నికల రిజల్ట్స్: పాపులర్​ ఓట్స్ ​కాదు ఎలక్టోరల్​ ఓట్స్​ వస్తేనే గెలుపు

అమెరికా ఎన్నికల రిజల్ట్స్: పాపులర్​ ఓట్స్ ​కాదు ఎలక్టోరల్​ ఓట్స్​ వస్తేనే  గెలుపు

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‎కు ఓ ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ ప్రజలు ఎవరికి ఎక్కువగా ఓటేస్తే వాళ్లే గెలవరు. 2016లో ట్రంప్​ కంటే హిల్లరీ క్లింటన్‎కు ఎక్కువ ఓట్లు​ వచ్చినా.. చివరికి ట్రంపే అధ్యక్షుడయ్యారు. దీనికి కారణం ఎలక్టోరల్ కాలేజ్. ఇది యూఎస్‎కు ఉన్న ప్రత్యేక వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారానే అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. ప్రజలు డైరెక్ట్‎గా ఓటు వేయడాన్ని ‘పాపులర్​ ఓటింగ్’​ అంటారు. ఈ పాపులర్​ ఓటింగ్‎లో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని నేరుగా విజేతగా ప్రకటించరు. ఎలక్టోరల్ ఓట్స్ ఎక్కువ వచ్చినవాళ్లే ప్రెసిడెంట్ అవుతారు. 

ఎలక్టోరల్​ కాలేజ్​ఎలా పనిచేస్తుంది?

ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. ప్రజలు డైరెక్ట్ గా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‎కు ఓట్లు వేయరు. ఎలక్టోరల్‌‌‌‌ కాలేజీ మెంబర్స్‌‌‌‌కు ఓట్లు వేస్తారు.  వీరందరూ  సమావేశమై ప్రెసిడెంట్, వైస్​ ప్రెసిడెంట్‎కు ఓటేస్తారు. దేశంలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి జనాభా ఆధారంగా ఓటర్లను కేటాయించారు. ఉదాహరణకు అధిక జనాభా ఉన్న కాలిఫోర్నియాలో 55 ఎలక్టోరల్​ ఓట్లు ఉండగా.. వ్యోమింగ్ లాంటి చిన్న రాష్ట్రానికి కేవలం 3 ఎలక్టోరల్​ ఓట్లు మాత్రమే ఉన్నాయి.​ ఇందులో  కనీసం 270 సాధించిన అభ్యర్థి ప్రెసిడెంట్ అవుతారు.