అదిలాబాద్ జిల్లా : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ముందు తుడుందెబ్బ నాయకులు, ఆదివాసీల ధర్నా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐటీడీఏ ఇన్ చార్జ్ పీఓ వరుణ్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు.. ఐటీడీఏ పరిసరాల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. శాంతి భద్రతలను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
అంతకుముందు..ఉట్నూర్ ఐటీడీఏను తుడుందెబ్బ నాయకులు ముట్టడించారు. ఎస్టీ జాబితాలోని 11కులాలను కలుపుతూ చేసిన తీర్మానంపై మండిపడుతున్నారు. లంబడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించి.. అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఐటీడీఏ కార్యాలయంలోకి తుడుందెబ్బ నేతలు, ఆదివాసీలు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఐటీడీఏ ఆఫీస్ పై రాళ్ల దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. ఇటు ఐటీడీఏ ఛైర్మన్ లాక్కెరావు కారును ధ్వంసం చేశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.