పిల్లలకు వ్యాక్సిన్ మంచిదే కానీ ఎప్పట్లో ఇస్తారు ?

 పిల్లలకు వ్యాక్సిన్ మంచిదే కానీ ఎప్పట్లో ఇస్తారు ?
  • కరోనాను ఎదుర్కోవడంలో మోడీ సర్కార్ అన్ని రకాలుగా విఫలం
  • దేశంలో ఉత్పత్తి సామర్థ్యం నెలకు 17 లక్షలలోపే.. పిల్లలు 47 కోట్ల మంది ఉన్నారు
  • కాంగ్రెస్ నేత రన్ దీప్ సింగ్ సుర్జివాలా

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రన్ దీప్ సింగ్ సుర్జివాలా ఆరోపించారు. పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలన్ని నిర్ణయం మంచిదే అయినా.. 47 కోట్ల మంది పిల్లలకు ఎప్పటిలోగా వ్యాక్సిన్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 16 లక్షల 80 వేలు మాత్రమేనని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని రన్ దీప్ సింగ్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. 

 

ఇవి కూడా చదవండి:

బీజేపీ వైఫల్యాలపై కేటీఆర్ బహిరంగ లేఖ

బదిలీ అయిన గన్ మెన్లకు ఘనంగా వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే