లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే7న జరిగింది. మంగళవారం సాయంత్రం పోలింగ్ ఓటింగ్ పూరై ఈవీఎం మెషిన్లు అప్పగించడానికి వెళ్తున్న సిబ్బంది వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోగల ముల్తాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగు ఈవీఎంలు కాలిపోయాయి.
#WATCH | Madhya Pradesh: A bus, carrying polling personnel, burst into flames while returning from Goula Village in the Multai assembly constituency of Betul Lok Sabha constituency last night. The polling personnel jumped off the bus and were safe. However, four EVMs suffered… pic.twitter.com/wlqMXrlB2z
— ANI (@ANI) May 8, 2024
బస్సులో మంటలు గమనించిన సిబ్బంది భయంతో బస్సు నుంచి కిందకు దూకేశారు. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేసిన పెనుప్రమాదం జరిగేది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ ప్రమాదంలో నాలుగు ఈవీఎంలు పాక్షికంగా కాలిపోయాయి. పోలింగ్ అనంతరం గౌలా గ్రామం నుంచి తిరిగివస్తుండగా బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.