ఎస్సై నన్ను చితకబాదాడు.. కోడిమ్యాల SI పై ఎస్పీకి ఫిర్యాదు

ఎస్సై నన్ను చితకబాదాడు..  కోడిమ్యాల SI పై ఎస్పీకి ఫిర్యాదు

జగిత్యాల జిల్లా కోడిమ్యాల ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఇటీవల తనను ఎస్సై  సందీప్ చితకబాదాడని ఆరోపించాడు . ఎస్సై కొట్టిన దెబ్బలకు తన కర్ణభేరి పగిలిందని ఆరోపించాడు. ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత ఎస్పీ అశోక్ కుమార్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పాడు బాధితుడు రాజేందర్ .

 పోలీసులను గమనించకుండా వెళ్లినందుకు తనను ఎస్సై  చితకబాదాడాని..ఇంటికి వచ్చి మరీ ఈడ్చుకుండూ కొట్టాడని చెప్పాడు బాధితుడు .  ఆ సమయంలో తన భార్యాపిల్లలు కాళ్లు మొక్కినా ఎస్సై సందీప్, కానిస్టేబుల్ రాకేష్  కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. అందరూ చూస్తుండగా కొట్టారని....ఎస్సై లాఠీ కూడా విరిగిందని బాధితుడు చెప్పాడు.  ఎస్సై సందీప్  భూ తగాదాల్లోనూ తలదూర్చాడని మరో బాధితుడు  ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.