హైదరాబాద్: యువతిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన ఆరోపణలపై ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హర్షసాయి తనను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఓ వైపు విచారణ జరుగుతుండగానే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూట్యూబర్ హర్షసాయిపై బాధితురాలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ALSO READ | హర్షసాయి కేసు : విల్లాలో మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి : బాధితురాలి లాయర్
ఇవాళ (సెప్టెంబర్ 26) అడ్వకేట్తో కలిసి నార్సింగ్ పీఎస్కు వెళ్లిన బాధితురాలు.. హర్షసాయి టార్చర్ చేస్తున్నాడని కంప్లైంట్ చేసింది. అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటి నుండి వరుసగా ఈ మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి వరుస ఫిర్యాదులతో పోలీసులు ఈ కేసులో విచారణ స్పీడప్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు హర్షసాయి కోసం గాలిస్తున్నారు. ఏ క్షణమైనా యూట్యూబర్ హర్షసాయిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.