మోతె (మునగాల), వెలుగు : తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ధర్నాకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో జరిగింది. శనివారం రాత్రి తుమ్మలపల్లికి చెందిన మంద ఉపేందర్ బైక్ పై ఇంటికి వెళ్తుండగా, ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిందంటూ మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు.
పోలీసులు నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఖమ్మం-–సూర్యాపేట జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవి అక్కడకు చేరుకొని విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.