గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన

 గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన

గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ ముందు ఆందోళన చేశారు.  అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి దాదాపు 500 మందిని మోసం చేశాడు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్. ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశాడు. ఇలా దాదాపు వంద కోట్లకు పైగా వసూలు చేసి పెట్టిన సొమ్ముకు ఐదు నెలల్లో రెట్టింపు ఇస్తానని నమ్మించాడు.

గోల్డ్ ట్రేడింగ్ లో వచ్చిన లాభాలను వారానికి ఒకసారి ఇస్తానని హామీ ఇచ్చాడు. రెండు నెలల పాటు లాభాలు చెల్లించి పరారయ్యాడు రాజేశ్. మోస పోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేశ్ ను అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. దీంతో బాధితులు సీసీఎస్ ముందు ఆందోళన చేశారు. తమ డబ్బులు ఇప్పించాలని కోరారు.