మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కురవి మండలంలోని తట్టుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామపంచాయతీ కార్యాలయంలోనే పురుగుల మందు తాగింది . గ్రామపంచాయతీ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కురవి మండలంలోని తట్టుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తోంది నాగలక్ష్మి. అయితే గత ఏడాది నుంచి గ్రామానికి చెందిన దొంతు యాదగిరి అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని.. పై అధికారులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. తన చావుతోనైనా తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొంది కార్యదర్శి నాగలక్ష్మి.
ALSO READ | అత్తింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య