ములకలపల్లి, వెలుగు : మండలంలోని సీతారాంపురం పంచాయతీ పాతూరు, ఎర్రోడు, మేడువాయి గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు సోమవారం రాస్తారోకో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులుగా మిషన్ భగీరథ వాటర్ సరఫరా కావడం లేదన్నారు. అధికారులకు, సెక్రటరీకి గ్రామస్తులు విన్నవించినా సమస్యను పట్టించుకోలేదన్నారు. సమస్యను జడ్పీటీసీ నాగమణికి వివరించారు.
దీంతో సోమవారం మహిళలతో కలిసి జడ్పీటీసీ ములకలపల్లి, పాల్వంచ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు సమస్యను అధికారులకు ఫోన్ లో వివరించారు. సాయంత్రం లోగావరకు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో అంజుమ్, బూరుగుపల్లి పద్మశ్రీ, విజయ, రవి తదితరులు పాల్గొన్నారు.