టీచర్లను కేటాయించాలంటూ స్కూల్‌‌‌‌‌‌‌‌కు తాళం

టీచర్లను కేటాయించాలంటూ స్కూల్‌‌‌‌‌‌‌‌కు తాళం

గద్వాల, వెలుగు : తమ గ్రామంలోని స్కూల్‌‌‌‌‌‌‌‌కు టీచర్లను కేటాయించాలంటూ గ్రామస్తులు సోమవారం స్కూల్‌‌‌‌‌‌‌‌కు తాళం వేసి నిరసన తెలిపారు. గద్వాల జిల్లా ధరూర్ మండలం ఓగులోనిపల్లి గ్రామంలోని సీపీఎస్‌‌‌‌‌‌‌‌లో 105 మంది స్టూడెంట్లు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు టీచర్లు ఉండగా స్కూల్స్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ అయినప్పటి నుంచి ఒక్కరే వస్తున్నారు. దీంతో ఒక్క టీచర్‌‌‌‌‌‌‌‌ తమ పిల్లలకు అన్ని సబ్జెక్టులు ఎలా బోధిస్తారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీచర్లను కేటాయించాలంటూ సోమవారం స్కూల్‌‌‌‌‌‌‌‌కు వచ్చి గేట్‌‌‌‌‌‌‌‌కు తాళం వేశారు. దీంతో టీచర్‌‌‌‌‌‌‌‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా ఎవరూ స్పందించకపోవడంతో పిల్లలను బయటకు పంపించి గేట్‌‌‌‌‌‌‌‌కు వేసిన తాళాన్ని అలాగే ఉంచేశారు. సంబంధిత ఆఫీసర్లు స్పందించి తమ గ్రామంలోని స్కూల్‌‌‌‌‌‌‌‌కు అదనపు టీచర్లను కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.