తమ గ్రామాలను బండలింగాపూర్‌‌లో చేర్చొద్దు..గ్రామస్తుల ఆందోళన

మేడిపల్లి, సత్తెక్కపల్లి గ్రామాల్లో ఆందోళనలు 

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మండలంలోని తమ గ్రామాలను కొత్తగా ఏర్పాటు కానున్న బండలింగాపూర్ మండలంలో చేర్చొద్దని మేడిపల్లి, సత్తెక్కపల్లి గ్రామస్తులు ఆందోళన చేశారు. మేడిపల్లిలో గ్రామస్తులు హైవేపై రాస్తారోకో చేయగా.. సత్తెక్కపల్లి గ్రామాభివృద్ధి కమిటీ అధ్వర్యంలో జీపీ ఆఫీస్ ​ముందు ఆందోళన చేశారు. 

సత్తెక్కపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేయనున్న మండల కేంద్రానికి తమ గ్రామం నుంచి రవాణా సౌకర్యం లేదన్నారు.  ఆత్మకూర్, జగ్గసాగర్, పాటిమీటి తండా గ్రామాలను కూడా మెట్ పల్లి మండలంలోనే కొనసాగించాలని ఆయా గ్రామాల ప్రజలు  ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కు వినతిపత్రం అందజేశారు.