ఎమ్మెల్యే హామీపై ముగ్గులు వేసి నిరసనలు తెలిపిన గ్రామస్థులు

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ముంగిళ్లన్నీ రంగులద్దుకున్నాయి. అయితే మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామస్తులు ముగ్గులతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఇచ్చిన హామీ మర్చిపోయిన ఎమ్మెల్యేకు ముగ్గుల  రూపంలో దాన్ని గుర్తు చేశారు.

తాండూరు మండలం రేపల్లి గ్రామస్థులు కొన్నేళ్లుగా ఊరికి రోడ్డు కోసం పోరాటం చేస్తున్నారు. పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 3 నెలల్లో రోడ్డు వేయిస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చాడు. అయితే ఎమ్మెల్యే మాట ఇచ్చి 7 నెలలు గడిచినా.. రోడ్డు మాత్రం మంజూరు కాలేదు. పైగా హామీ నెరవేర్చమని అడిగిన వారిపై 3 అక్రమ కేసులు పెట్టించాడు. దీంతో గ్రామస్థులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు సంక్రాంతి ముగ్గులతో నిరసన తెలిపారు. 3 నెలల్లో రోడ్డేయిస్తాని హామీ ఇచ్చి 7 నెలలైనా ఇప్పటికి ఆ పనులు చేయించకపోగా.. ముగ్గురిపై అక్రమ కేసులు పెట్టించాడని, ఇప్పటికైనా ఆయన రోడ్లు వేయించి ఓట్లేసిన ప్రజల రుణం తీర్చుకోవాలని 

 

ముగ్గు వేసి తమ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముగ్గులు వేశారు. 3నెలల్లో రోడ్లు వేయిస్తామన్న ఎమ్మెల్యే 7నెలలు గడిచినా దానిని పట్టించుకోలేదన్నారు. రోడ్లు వేయించి ప్రజల రుణం తీర్చుకోవాలని ముగ్గులు వేశారు. ప్రస్తుతం ఈ ముగ్గులు చర్చనీయాంశంగా మారింది.