భార్యను చంపిన వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్థులు

భార్యను చంపిన వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్థులు

ఉత్తరప్రదేశ్ : భార్యను చంపిన భర్తను గ్రామస్ధులు నడిరోడ్డుపై చితకబాది చంపారు. ఈ సంఘటన యూపీలో జరిగింది. వివరాలు : ఫతేపూర్ జిల్లా, సిమౌర్ గ్రామానికి చెందిన నసీర్ ఖురేషి(40), అతడి భార్య అఫ్సారీ(35)కి ప్రతి రోజు గొడవ జరిగేది. ఈ బుధవారం తాగివచ్చిన అఫ్సారీ.. భార్యతో గొడవ చేశాడు. కోపంలో గొడ్డలితో నరికి చంపాడు. గమనించిన గ్రామస్థులు అఫ్సారీని పారిపోకుండా రోడ్డుకు అడ్డంగా నిర్భందించారు. ఆ తర్వాత

అతడిపై రాళ్లదాడి చేశారు. ఇనుప కడ్డీలతో మరికొందరు బలంగా కొట్టడంతో అఫ్సారీ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనను యువత వీడియో తీయడంలో పోలీసులకు తెలిసింది. ఘటనాస్థలానికి చేరుకుని 2 డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం హస్పిటల్ కి తరలించి, కేసు నమోదు చేశామని తెలిపారు.

అయితే అఫ్సారీని చంపే అధికారం గ్రామస్థులకు అధికారం ఎక్కడిదని పోలీసులు అడుగగా.. మృగంలా వ్యవహారించిన వారికి అసలు శిక్ష ఇదేనని పోలీసులపై వాగ్వాదానికి దిగారు గ్రామస్థులు. కేసు పెడితే కొన్ని రోజులు మాత్రమే జైల్లో ఉంటాడని..ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే చంపేయడమే సరైన నిర్ణయం అని చెప్పారు గ్రామస్థులు. దీనిపై విచారణ తర్వత ఎవరిని అరెస్ట్ చేయాలనేదానికి నిర్ణయం తీసుకుంటామని స్థానిక మీడియాకు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామస్థులు చేసిన మంచి పనికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.