- ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
- రూ.68 వేల నగదు, మూడు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం
హనుమకొండ, వెలుగు : ఐపీఎల్క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్‌ను వరంగల్ టాస్క్‌ఫోర్స్‌పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.68 వేల నగదు, మూడు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎం.జితేందర్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ పీఎస్ పరిధి గుండ్ల సింగారానికి చెందిన లావుడ్య రాజేందర్, కొర్ర ప్రమోద్, సయ్యద్అంకూస్, నూనావత్ తిరుపతి, చిత్తరి కోటిలింగం ఐపీఎల్సీజన్స్టార్ట్ కావడంతో బెట్టింగ్దందాకు తెరలేపారు.
ఆన్ లైన్లో ఓ యాప్ డౌన్‌లోడ్‌చేసుకుని బెట్టింగ్ కు పాల్పడుతుండగా.. టాస్క్ ఫోర్స్పోలీసులకు సమాచారం అందింది. దీంతో వరంగల్ టాస్క్ఫోర్స్సీఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో మంగళవారం గుండ్లసింగారంలో తనిఖీలు నిర్వహించారు. బెట్టింగ్ఆడుతున్న రాజేందర్, ప్రమోద్, సయ్యద్ అంకూస్‌ను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి, కోటిలింగం పరారీలో ఉన్నారు.