-
ఏజెంట్లతో కలిసి రూ.18.7 లక్షలు కాజేసిన అసిస్టెంట్లేబర్ఆఫీసర్
-
ఇద్దరి అరెస్ట్.. పరారీలో ఐదుగురు
హనుమకొండ, వెలుగు: ఫేక్డాక్యుమెంట్స్తో లేబర్ ఇన్సూరెన్స్క్లెయిమ్చేస్తూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అసిస్టెంట్ లేబర్ఆఫీసర్ సహకారంతో దాదాపు రూ.18.7 లక్షలు కాజేసినట్లు గుర్తించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఏఎల్వో సహా ఐదుగురు పరారీలో ఉన్నారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి శుక్రవారం కమిషనరేట్ఆఫీస్లో వెల్లడించారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్మికుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తోంది. పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందుతుండటంతో నర్సంపేట ఏఎల్వో మహమ్మద్అలీ ఫేక్డాక్యుమెంట్లతో బీమా క్లెయిమ్స్చేసేందుకు ప్లాన్ చేశాడు. నెక్కొండకు చెందిన రాపాక వీరభద్రస్వామి, చెన్నారావుపేటకు చెందిన పర్ష రవి, నెక్కొండ మండలం అమీన్ పేటకు చెందిన లావుడ్య నర్సింహ, రెడ్లవాడ ఉపసర్పంచి చందు, వాగ్యనాయక్తండాకు చెందిన లావుడ్య పులియా, నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన చిందం అశోక్‌ను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ఏజెంట్లతో గ్రామాల్లోని నిరుపేదలకు లేబర్ కార్డ్స్ ఇప్పించడం స్టార్ట్ చేశాడు. కార్డు కోసం రూ. 110 తీసుకోవాల్సి ఉండగా.. ఒక్కొక్కరి నుంచి రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేశారు. తర్వాత సాధారణ, యాక్సిడెంట్ మరణాల లేబర్ ఇన్సురెన్స్, ప్రసూతి, పెండ్లికి ఇచ్చే సహాయం కోసం లబ్ధిదారుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. పర్ష రవికి నర్సంపేటలో డీటీపీ సెంటర్ఉండగా.. అందులో నుంచి అప్లై చేసేవారు.
అర్హత లేకున్నా ఏఎల్వో అలీ వాటిని అప్రూవ్‌చేసి నోడల్ఆఫీసర్ ద్వారా శాంక్షన్చేయించేవాడు. ఇటీవల కాలంలో ‘వెలుగు’ పేపర్లో లేబర్ బీమా దందాలపై వరుస కథనాలు రావడంతో టాస్క్‌ఫోర్స్‌పోలీసులు ఈ బాగోతంపై స్పెషల్ ఫోకస్‌పెట్టారు. పక్కా సమాచారంతో రాపాక వీరభద్రస్వామి, పర్ష రవిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 కొత్త అప్లికేషన్స్, మూడు సీపీయూలు, నాలుగు మానిటర్లు, స్మార్ట్ ఫోన్, రూ. 5 వేలు స్వాధీనం చేసుకున్నారు. 2018 నుంచి ఫేక్ డాక్యుమెంట్లతో పర్ష రవి డీటీపీ సెంటర్ నుంచి 23 అప్లికేషన్స్పెట్టారని, అందులో 9 అప్లికేషన్లను ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే అప్రూవ్ చేసినట్లు గుర్తించారు. మిగతా 14 ప్రాసెస్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.18.70 లక్షల గోల్మాల్జరిగినట్లు తేలింది. ఏఎల్వో అలీ, మిగతా నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.