రంగంలోకి ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్స్

రంగంలోకి ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్స్
  •    సిటీలోని మ్యాన్ హోల్స్​ వద్ద గార్డులుగా నియామకం
  •     ఒక్కో డివిజన్​కు ఐదు మందిని కేటాయించిన వాటర్​బోర్డు
  •     వానల టైంలో వెంటనే స్పందించేలా ఏర్పాట్లు
  •     డీ– వాటరింగ్ మోటార్లతో కూడిన వాహనాలు అప్పగింత

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్​ సిటీని వరుసగా భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో వాటర్​బోర్డు అలర్ట్​అయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటోంది. వర్షం కురిసే టైంలో మ్యాన్​హోళ్లు పొంగి కాలనీలు, ప్రధాన కూడళ్లు, రోడ్లు వరద నీటితో నిండిపోతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలో డ్రైనేజీలు, మ్యాన్​హోళ్లు పొంగకుండా చేసేందుకు వాటర్​బోర్డు ఎమర్జెన్సీ రెస్పాన్స్​టీమ్స్​ను సిద్ధం చేసింది. వీటితోపాటు మాన్సూన్​సేఫ్టీ టీమ్స్, సేఫ్టీ ప్రొటోకాల్​టీమ్స్​అందుబాటులో ఉంటాయని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు.

ఇవన్నీ వర్షం కురిసే టైంలో రోడ్లపై ఉంటాయి. ఎక్కడైనా మ్యాన్​హోళ్లు పొంగితే వెంటనే చర్యలు తీసుకుంటాయి. రోడ్లపై వరద, డ్రైనేజీ నీరు నిలవకుండా చేస్తాయి. వాటర్​లాగింగ్​ఏరియాల్లో డీ–వాటరింగ్​ మోటార్లతో వరద నీటిని తోడేస్తాయి. అలాగే ఎయిర్​టెక్​ మెషీన్ల సాయంతో మ్యాన్​హోళ్లకు అడ్డంపడిన వ్యర్థాలను తొలగిస్తాయి. ప్రస్తుతానికి 35 ఎమర్జెన్సీ రెస్పాన్స్​టీమ్స్ ను సిద్ధం చేసినట్లు వాటర్​బోర్డు అధికారులు తెలిపారు.

కొనసాగుతున్న క్లీనింగ్​ ప్రక్రియ 

గ్రేటర్​ పరిధిలోని ప్రధాన కూడళ్లు, కాలసీల్లో లోతైన మ్యాన్ హోళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్లపై దాదాపు 20 అడుగుల లోతైన ట్రంక్​ మెయిన్ ​లైన్లు ఉన్నాయి. మొత్తంగా 5 వేల వరకు ట్రంక్​​మెయిన్​ లైన్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 25 వేల వరకు మ్యాన్​హోళ్లు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా మ్యాన్​హోళ్లను క్లీన్ ​చేసినట్లు వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. 22 వేలకు పైగా మ్యాన్ హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్ బిగించినట్టు చెప్పారు. మూతలు, గ్రిల్స్​లేక గతంలో వర్షాల సమయంలో చాలా ప్రమాదాలు జరిగాయి.

మ్యాన్​హోళ్లలో పడిపోయి కొట్టుకు పోవడం, గాయాల పాలైన కేసులు ఉన్నాయి. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈసారి వాటర్​బోర్డు చర్యలు తీసుకుంటోంది. వర్షాకాలం పూర్తయ్యే వరకు నగరంలోని ప్రధాన మ్యాన్​హోళ్లను క్లీన్​చేయడంతోపాటు, పూడిక తీసే పనులు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. మ్యాన్ హోళ్లను పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్​కు ఒక ఎమెర్జెన్సీ బృందాన్ని నియమించి, వారికి అవసరమైన పనిముట్లు

డీ–వాటరింగ్​ మోటార్లతో కూడిన వాహనాన్ని సమకూర్చినట్టు తెలిపారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూతలు ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా, ఓవర్​ ఫ్లో అవుతున్నా  లేదా ఇతర సమస్యలు, ఫిర్యాదులుంటే వెంటనే వాటర్​బోర్డు కస్టమర్​కేర్​నంబర్​155313కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.