రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలి

రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్​సిటీ, వెలుగు: రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వాటర్​బోర్డు అలర్టయ్యింది. డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలతో ఎండీ అశోక్​ రెడ్డి ఆదివారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. వర్షాల వల్ల కలుషిత నీరు సరఫరా అయ్యే అవకాశమున్న నేపథ్యంలో దానిపై దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. గుర్తించిన వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ఈఆర్టీ, ఎయిర్ టెక్ మెషీన్లతో సిద్ధంగా ఉండాలన్నారు. సీవరేజీ సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. అక్టోబర్ 2 నుంచి చేపట్టే ఇంకుడు గుంతల నిర్మాణం, పునరుద్ధరణ  స్పెషల్ డ్రైవ్ కోసం సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.