భద్రాచలం, వెలుగు : గోదావరి నదికి వరద పోటెత్తడంతో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. భద్రాచలం వద్ద శుక్రవారం స్నాన ఘట్టాలను తాకింది. బుధ, గురువారాల్లో భారీ వానలు కురవడంతో ఎగువన ఉన్న మేడిగడ్డ, తాలిపేరుల నుంచి వరద వచ్చింది. గురువారం 15 అడుగుల ఎత్తులో ఉన్న నీటిమట్టం శుక్రవారం 19 అడుగులకు చేరుకుంది. సాయంత్రానికి ప్రవాహం ఆగడంతో నిలకడగా మారింది.
స్నానఘట్టాల వద్ద ఉన్న చిరు వ్యాపారులను అధికారులు వేరేచోటికి తరలించారు. మొన్నటి దాకా ఇసుకు తిన్నెలతో ఉన్న గోదావరి ఒక్కసారిగా జలకళ సంతరించుకోవడంతో నదీ పూజలు నిర్వహించారు.
పాలేరుకు సాగర్ నీళ్లు
కూసుమంచి : నల్గొండ జిల్లాలోని దేవులపల్లి జలాశయం నుంచి బుధవారం టీఎంసీ సాగర్‌జలాలను విడుదల చేశారు. గురువారం రాత్రికి పాలేరు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం సాగర్ రెండో జోన్కాలువ వద్ద ఇన్‌ఫ్లోను ఖమ్మం జలవనరుల శాఖ సీఈ శంకర్‌నాయక్ పరిశీలించారు.