హైదరాబాద్లో పూర్తిగా మారిన వాతావరణం.. మరో రెండ్రోజులు.. పొగ మంచు పట్టే అవకాశాలు

హైదరాబాద్లో పూర్తిగా మారిన వాతావరణం.. మరో రెండ్రోజులు.. పొగ మంచు పట్టే అవకాశాలు
  • మంచు కురిసే రోజుల్లో ముసురు
  • కుత్బుల్లాపూర్​లో అత్యధికంగా 2.08 సెం.మీ. వాన
  • గంటకు 4 నుంచి 8 కి.మీ. వేగంతో చలిగాలులు
  • ఇయ్యాల, రేపు పొగ మంచు పట్టే అవకాశాలు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్​ పరిధిలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గురువారం రోజంతా సిటీని నల్లటి మేఘాలు కమ్మేశాయి. చలిగాలులతో పాటు చిరు జల్లులు కురిశాయి. పలు ప్రాంతాల్లో ముసురు వాన పడింది. సాయంత్రం 6 గంటల తర్వాత అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో 2.08 సెంటీ మీటర్ల వాన కురిసింది.

షేక్ పేట, బహదూర్ పురా, ముషీరాబాద్, హయత్ నగర్, నాంపల్లి, చార్మినార్, బంజారాహిల్స్, లంగర్ హౌస్, పద్మారావునగర్, బోయిగూడ, బన్సీలాల్​పేట, వారాసిగూడ, బౌద్ధనగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీచాయి. మరో రెండ్రోజులపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తెల్లవారుజాము నుంచి పొగ మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.