ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మెగా ఈవెంట్ కోసం విండీస్ బోర్డు స్టార్ హిట్టర్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. సీనియర్ బ్యాట్స్ మన్ జాన్సన్ చార్లెస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. నికోలస్ పూరన్ వెస్టిండీస్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. రోవ్‌మన్ పావెల్ వైస్ కెప్టెన్ గా టీ20 వరల్డ్ కప్లో ఆడబోతున్నాడు.
ICYMI: CWI has announced the 15-man squad for the Men's T20 World Cup 2022 in Australia! #MenInMaroon #T20WorldCup
— Windies Cricket (@windiescricket) September 14, 2022
More details⬇️ https://t.co/t6ils9Xdox pic.twitter.com/GKxgCHZcvG
మిశ్రమ జట్టు...
టీ20 వరల్డ్ కప్ కోసం విండీస్ జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ క్రికెటర్లకూ అవకాశాలు ఇచ్చామని క్రికెట్ వెస్టిండీస్ లీడ్ సెలెక్టర్ డా.డెస్మండ్ హేన్స్ తెలిపాడు. కరేబియన్ క్రికెట్ లీగ్ లో రాణించిన ప్లేయర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పాడు. విండీస్ క్రికెట్ భవిష్యత్ కోసం..బాగా రాణించే ఆటగాళ్లను సెలక్ట్ చేశామన్నాడు. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ రౌండ్ నుంచి సూపర్ 12లకు అర్హత సాధించాల్సి ఉందని..తాము ఎంపిక చేసిన టీమ్ ప్రతి అడ్డంకిని ఎదుర్కొంటుందని ఆశిస్తున్నట్లు హేన్స్ ధీమా వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్..
నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), యానిక్ కారియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, షిమ్రాన్ హేట్మయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్‌కాయ్, రేమాన్ రీఫర్, ఓడియన్ రీఫర్.