క్రికెట్ లో ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం.. చివరి మ్యాచ్ తర్వాత ఎమోషనల్ కావడం..సహచరులతో సహా అందరూ అభినందిచడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ వార్నర్ ఫేర్‌వెల్ మాత్రం ఇప్పటివరకు ఎవరికీ జరగని విధంగా చాలా గ్రాండ్ గా జరిగింది. వేలమంది ఫ్యాన్స్ గ్రౌండ్ లోకి దూసుకొచ్చి మరీ ఈ స్టార్ ఓపెనర్ కు గుడ్ బై చెప్పడం విశేషం.
సిడ్నీ క్రికెట్ లో జరిగిన చివరిదైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఈ రోజు( జనవరి 6) 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా వార్నర్ తన టెస్ట్ కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 34 పరుగులు చేసిన వార్నర్.. 130 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్ లో 75 బంతుల్లో 57 పరుగులు చేసి సాజిద్ ఖాన్ బౌలింగ్ లో ఎల్‌బిడబ్ల్యుగా వెనుదిరిగాడు. వార్నర్ ఔటయ్యే సమయానికి ఆస్ట్రేలియా మరో 11 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రేక్షకులు అతను మైదానం నుండి బయలుదేరినప్పుడు ప్రేక్షకులకు చేతులు ఊపుతూ స్టాండింగ్ ఒవేషన్‌తో సత్కరించారు.
ప్రెజెంటేషన్ సమయంలో ఏకంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఉన్న అభిమానులని గ్రౌండ్ లోకి అనుమతించడంతో వార్నర్ వీడ్కోలు మరింత ఘనంగా ముగిసాయి. వీరందరూ వార్నర్.. వార్నర్.. అంటూ గ్రౌండ్ అంతటా హోరెత్తించారు. ఇన్నేళ్ల క్రికెట్ చరిత్రలో వార్నర్ కు దక్కిన అరుదైన గౌరవంగా దీనిని భావించవచ్చు. పాక్ క్రికెటర్లు సైతం వార్నర్ ఔటైన తర్వాత వరుసగా నిలబడి చప్పట్లతో అభినందించారు. ఈ సిరీస్ లో భాగంగా పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో 165 పరుగులు చేసిన వార్నర్.. సిరీస్ అంతటా నిలకడగా రాణించాడు.
వార్నర్ కెరీర్ విషయానికి వస్తే 2011లో ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ అరంగ్రేటం చేసాడు. దూకుడుగా ఆడటంతో పాటు నిలకడగా పరుగులు చేసే అతి కొద్దిమందిలో వార్నర్ ఒకడు. తన కెరీర్ లో మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 335 కాగా, సగటు 44.60.
The whole crowd at SCG were allowed to enter the ground to see Warner for one final time in Tests. pic.twitter.com/UVGQKoDLoY
— Johns. (@CricCrazyJohns) January 6, 2024