హైదరాబాద్ లోని కేపీ.హెచ్.బీలో భర్త తల పగలగొట్టింది భార్య. స్నానం చేసే సమయంలో భర్త వీపు తోమాలని భార్య పై గట్టిగా కేకలు వేయడంతో క్షణికావేశంలో ఐరన్ రాడ్ తో భర్త తలపై కొట్టింది భార్య. ఆదివారం ( అక్టోబర్ 6, 2024 ) చోటు చేసుకుంది ఈ ఘటన.
నల్లగొండ జిల్లాకు చెందిన శివ తన భార్య పిల్లలతో కలిసి కేపి.హెచ్.బీ కాలనీ మూడవ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఉదయం శివ స్నానం చేసే సమయంలో వీపుతోమాలని భార్యపై గట్టిగా కేకలు వేశాడు.
చుట్టుపక్కల వారు వింటే బాగోదు అని భార్య చెప్పడంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు శివ. దీంతో భార్య అక్కడే ఉన్న ఐరన్ రాడ్ తో తలపై కొట్టడంతో శివకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పైన భర్త శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.