దారుణం : తాళ్లతో కట్టేసి.. వేడి నీళ్లు పోసి భర్తను చంపిన భార్య

దారుణం : తాళ్లతో కట్టేసి.. వేడి నీళ్లు పోసి భర్తను చంపిన భార్య

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ భార్య, భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ ఆదర్శనగర్ లో హేమంత్ అనే వ్యక్తి తన భ్యార్యతో కలిసి నివసిస్తున్నాడు. భార్య రోహితి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పేషంట్ కేర్ గా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలోనే బుధవారం రోజు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన రోహితి భర్తను తాళ్లతో కట్టేసి.. కొట్టి.. వేడి నీళ్లు పోసి... అతి కిరాతకంగా గాయపరిచింది.

 అనంతరం భర్తను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. హేమంత్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. గాయపరిచిన విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఆరా తీశారు. హేమంత్ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించడంతో రోహితిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని పోలీసులు వెల్లడించారు.