నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్య రూ.2 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇందల్వాయిలో గోపాల్, పీరుబాయి దంపతులు నివసిస్తున్నారు. భర్త మద్యానికి బానిసై భార్యను తరచూ వేధిస్తుండేవాడు. విసిగిపోయిన భార్య అతడిని హత్య చేయించాలని నిర్ణయించుకుంది.
కమ్మలు అమ్మి డబ్బులు ఇచ్చి..
భర్తను హత్య చేయడానికి చందర్, మహేష్ లకు కమ్మలు అమ్మి రూ.2 లక్షల సుపారీ ఇచ్చింది. పథకం పన్నిన వారిద్దరూ ఏప్రిల్ 30న మాటు వేసి గోపాల్ ని కిరాతకంగా హతమార్చారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 4 సెల్ ఫోన్లు, ఓ బైక్, పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.