వీకెండ్ వచ్చిదంటే చాలా మంది టూర్ కు ప్లాన్ చేసుకుంటారు. కొన్ని కుటుంబాలు కలిసి విహార యాత్రకు వెళతాయి. ఏదైనా దేవాలయానికో.. చారిత్రాత్మక ప్రదేశానికో.. లేకపోతే పార్కులకో వెళతారు. ఎక్కడకు వెళ్లినా తిండి తినాల్సిందే కదా.. కొన్నిసార్లు ఇంట్లోనే తయారు చేసుకొని తీసుకెళ్తే ,... ఇంకొన్ని సార్లు టూరిస్ట్ స్పాట్ లోనే తయారు చేసుకుంటారు. అయితే ఓ మహిళ విహారయాత్రకు వెళ్లినప్పుడు చేసిన వంటకం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె అత్యంత విషం గల నాగుపాములను కూర వండుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ...
వరుసగా రెండు మూడు రోజులు హాలిడేస్ వచ్చాయంటే చాలు...ఇప్పుడు జనాలు పిక్ నిక్ పేరుతో విహారయాత్రకు వెళుతుంటారు. కొన్ని ఫ్యామ్లీస్ కలిసి టూర్‌కు వెళుతుంటాయి. అయితే అక్కడకు వెళ్లిన తరువాత పిక్నిక్ స్పాట్ లోనే ఆహారం తయారు చేసుకుంటారు. ఇలా విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళ చేస్తున్న వంటకం వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన తరువాత జనాలు షాక్ కు గురయ్యారు, ఈ వీడియోలో ఆ మహిళ గ్యాస్ స్టవ్ పై పాన్‌లో వంటకాన్ని తయారుచేస్తున్నట్లు ఉంది.
ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తే పంట పొలాల్లోకి విహారయాత్రకు వెళ్లిన విధంగా ఉంది. ఆమె వంట వండే ప్రదేశంలో తరిగిన పచ్చి కూరగాయలు ఉన్నాయి. గ్యాస్ స్టవ్పాన్ లో ఉంచి ఏదో కూర వండుతుంది. అయితే మూత తీయగానే జనాలు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకూ ఆమె ఏం కూర వండుతుందంటే... అత్యంత ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రాను కూర వండుతుంది. ఈ కూర ఎలా ఉందో టేస్ట్ చేసింది.
కోబ్రాకు సంబంధించిన డిష్‌ను తయారు చేస్తున్న సమయంలో అతని స్నేహితుడు ఒకరు వీడియోను కూడా సిద్ధం చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో త్వరగా వైరల్ అయ్యింది, మహిళ కూర వండే పాన్‌లోని వేడినీటిలో నాగుపాము ఉంది. అందులో కొన్ని పచ్చి కూరగాయలు కూడా వండుతోంది. గ్రేవీని రుచి చూసఇంది. అయితే, ఆ మహిళ కూరగాయలతో పాటు, పాముతో పాటు అనేక వస్తువులను కూడా ఉంచింది. చైనా నుండి వియత్నాం వరకు, ప్రజలు పాముతో చేసిన వంటకాలను ఆనందంతో తింటారు.
ఈ కోబ్రా కర్రీ తయారు చేసే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @babugym_1982 అనే వినియోగదారు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసారు. పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఈ వీడియోను మిలియన్ల మందివీక్షించారు. ఇప్పటికి ( వార్త రాసే సమయానికి)య 1 లక్ష 42 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఇది తిన్న తర్వాత తన భర్తకు చనిపోయిన వీడియోను కూడా షేర్ చేయాలని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఇంకొకరు ఈ పామును ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళితే దాని ప్రాణం కాపాడవచ్చని రాశారు. , నీతు అనే వినియోగదారు మీరు పామును కూడా వదలరా? అని రాశారు. కొంతమంది స్నేక్ డిష్ తయారు చేసిన మహిళపై ప్రశంసలు కురిపించారు. కొందరు ఇది స్నేక్ బిర్యానీ అని రాశారు.