గృహలక్ష్మి .. మహాలక్ష్మి ఒక్కరే!!

సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరీ సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో అధికారం లోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల కర్ణాటక ఎన్నికల సందర్భంగా అక్కడి గృహలక్ష్మి పథకానికి రూపొందించిన ప్రకటనలోని మహిళ.. ఇక్కడ అమలు చేయబోయే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ప్రకటనలో మహిళ ఒక్కరే కావడం గమనార్హం. కర్ణాటక పథకాలను తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అడ్వ ర్టెజ్ మెంట్ లోనూ ఆ మహిళ ఫొటోనే పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.