బీజేపీ నాయకుల పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటలకు బీజేపీలో విలువ లేదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటే చెప్పుతో కొట్టండి అనేది డ్రామా అని ఆరోపించారు. వాళ్ళ మాటలకు ఆ పార్టీలో విలువ లేదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారి ఒప్పందంలోనే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ ప్రధాని కావద్దని కుట్రలో బీఆర్ఎస్ ఒక పావుగా తయారైందని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ సీట్లకు గండి కొట్టే కుట్రలో బీజేపీ, బీఆర్ఎస్ తీరు ఉందన్నారు. సిద్ధాంతాలు చెప్పే పార్టీలు డూప్లికేట్ పార్టీలు అని జగ్గారెడ్డి అన్నారు. మాట మీద నిలబడి సెక్యులర్ మాటకు కట్టుబడి ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి సిద్ధాంతాలు లేవని అన్నారు. కొత్త నాటకంకు రెండు పార్టీలు తెర లేపారని అని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో పదేళ్లు అధికారంలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని మార్చారని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడింది కేవలం కాంగ్రెస్ ఎంపీలే అని జగ్గారెడ్డి అన్నారు.