- త్వరలోనే సీట్ల కేటాయింపు పూర్తి
- వచ్చే నెలలోనే ప్రారంభం కానున్న క్లాసులు
- ఇంకా ఎక్కడికక్కడే ఉన్న పనులు
- ఉన్నతాధికారులు చొరవ చూపితేనే పనులు పూర్తి
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ఏడాది మెడికల్ప్రారంభం కానుండగా, పర్మినెంట్ బిల్డింగ్నిర్మించే వరకు కాలేజీని మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ కోసం నిర్మిస్తున్న బిల్డింగ్‌లో నిర్వహించాలని, కాలేజీ అనుబంధ హాస్పిటల్‌ను జిల్లా హాస్పిటల్లో కొనసాగించాలని నిర్ణయించారు. ఇందుకనుగుణంగా మార్పులు చేస్తున్నారు. నెలరోజుల్లో తరగతులు ప్రారంభం కానుండగా, ఆయా చోట్ల కొనసాగుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెడికల్‌కాలేజీకి కేటాయించిన మాతా శిశు సంరక్షణ హాస్పిటల్రెండో అంతస్తులో అదనపు గదులు నిర్మిస్తున్నారు.
ఇక్కడే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ప్రాక్టికల్ రూమ్స్, పక్కనే లెక్చర్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు స్లోగా సాగుతున్నాయి. బిల్డింగ్‌కు కలరింగ్ వేయాల్సి ఉంది. ల్యాబ్స్, లైబ్రరీ రూమ్స్ పూర్తికాలేదు. ఇంకా ఫర్మిచర్ రాలేదు. అడ్మిషన్లు షూరు కావడం, మరో వైపు క్లాసుల గడువు కూడా దగ్గర పడుతున్న దృష్ట్యా నిర్మాణ పనులపై ఆఫీసర్లు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటేగానీ పనులు త్వరగా కంప్లీటయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
అనుబంధ హాస్పిటల్లో కోసం..
మెడికల్ కాలేజీ కి సంబంధించిన అనుబంధ హాస్పిటల్‌ను జిల్లా ఆసుపత్రిలో కొనసాగించాలని నిర్ణయించారు. ఇక్కడ 200 బెడ్లు ఉన్నాయి. స్థలం ఇరుకుగా ఉండడంతో సెకండ్ ఫ్లోర్‌పై తాత్కాలికంగా రేకుల షెడ్లు వేశారు. ఈ పనులు ఇంకా కంప్లీట్ కాలేదు. గోడలు, రేకులు మాత్రమే వేశారు. ఇంకా సీలింగ్పనులు చేయాల్సి ఉంది.
వచ్చే నెలలోనే క్లాసులు షురూ..
వచ్చే నెలలోనే క్లాసులు షురూ కానున్నాయి. ఇప్పటికే ఆలిండియా కోటా కౌన్సిలింగ్లో స్టూడెంట్స్కేటాయింపు పూర్తయింది. వేరే రాష్ట్రానికి చెందిన ఓ స్టూడెంట్వచ్చి అడ్మిషన్ కూడా తీసుకున్నాడు. స్టేట్స్టూడెంట్స్కౌన్సిలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో జరగనుంది. కాలేజీలో ఇప్పటికే 10 మంది ప్రొఫెసర్లు, 24 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు డ్యూటీలో చేరారు. ఆఫీస్స్టాఫ్కూడా కొందరు వచ్చారు.
స్టూడెంట్స్వచ్చే వరకు రెడీ చేస్తాం
స్టూడెంట్స్ వచ్చే వరకు కాలేజీ బిల్డింగ్, హాస్పిటల్మొత్తం రెడీగా ఉంటుంది. కాలేజీ బిల్డింగ్‌లో చాలా వరకు పనులు కంప్లీటయ్యాయి. లెక్చర్‌హాల్ పనులు కూడా కంప్లీటవుతాయి. హాస్పిటల్లోనూ పనులు కొనసాగుతున్నాయి. స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.
- డాక్టర్ వెంకటేశ్వర్లు, కాలేజీ ప్రిన్సిపల్