బొగ్గు గనుల పని స్థలాల్లో గాలి ఆడడం లేదు : ఏఐటీయూసీ

కోల్​బెల్ట్​,వెలుగు : మందమర్రి ఏరియా కేకే5 సింగరేణి అండర్​ గ్రౌండ్​ మైన్​లోని  పని స్థలాల్లో గాలి సప్లయ్​ సక్రమంగా లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ అన్నారు. గురువారం కేకే‌‌-5 గని కార్మికులను ఏఐటీయూసీ ప్రతినిధులు కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  గనిలోని 78వ ప్యానల్​ పని స్థలం వద్ద కార్మికులకు సరిపడేంత  గాలి సప్లయ్​ చేయడంలో  మైన్​ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.  

బోల్టర్​ మిషన్​వాటర్​ లీకేజీ వల్ల పని స్థలాలు బురదమయంగా మారుతున్నాయని చెప్పారు.  గని పని స్థలాల్లోని సమస్యలను మైన్​ యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్రాంచి అసిస్టెంట్​సెక్రటరీ కంది శ్రీనివాస్​, దేవసాని సాంబయ్య, పిట్ సెక్రటరీలు కొత్త తిరుపతి, వి.ప్రభాకర్​, గాండ్ల సంపత్​, కండె రాజ్​కుమార్​, శ్రీధర్​, సంపత్​, చందు, రాములు తదితరులు పాల్గొన్నారు.