జీహెచ్ఎంసీలో సూపర్ వైజర్ల ఆగడాలు

జీహెచ్ఎంసీలో సూపర్ వైజర్ల ఆగడాలు

హైదరాబాద్: జీతాలియ్యమంటే తమను వేధిస్తున్నారని జీహెచ్ఎంసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలియ్యాలని అడిగినందుకు తమను ఎస్ఎఫ్ఏలు బూతులు తిడుతున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. పొట్ట కూటి కోసం పని చేస్తున్న స్వీపర్లతో పాటు పెన్షనర్ల దగ్గర కూడా మామూళ్ళు వసూలు చేస్తున్నట్టు ఆవేదన చెందుతున్నారు. డబ్బులు ఇస్తే ఓకే... లేకపోతే దాడులకు పాల్పడుతున్నారని, డ్యూటీలు తీయిస్తామని భయపెడుతన్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. 

జీతం పడగానే ఎస్ఎఫ్ఏలకు రూ.400 ఇవ్వాలె

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 30 సర్కిళ్ళలో 18 వేల కార్మికులు 950 మంది సూపర్ వైజర్ల కింద పని చేస్తున్నారు. ఒక్కో గ్రూపులో లో ఏడుగురు వర్కర్లు ఉంటారు. ఇలాంటి 3 గ్రూపులకు ఒక  సూపర్ వైజర్ పనిచేస్తారు.  శానిటేషన్ వర్కర్లకు ప్రతి నెలా 17 వేల జీతం ఉండగా... కటింగ్స్ పోను 14 వేల 500 రూపాయలు అకౌంట్స్ లో జమ అవుతాయి. జీతం వచ్చిన రోజే 500 రూపాయలను ఎస్ఎఫ్ఏలకు ఇవ్వాలని, ఎవరైనా డబ్బులు డబ్బులివ్వకపోతే కొలువు నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నట్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బల్దిమా కమిషనర్ పట్టించుకుంటలే

గ్రేటర్ పరిధిలో పనిచేస్తున్న 18 వేల మంది స్వీపర్లు.... సూపర్వైజర్లకు నెలకు కోటీ 80 లక్షలకు పైగా చెల్లిస్తారు. డబ్బులివ్వకపోతే జీతంలో ఏదో రకంగా కోతలు పెడతారు. ఒక్క రోజు ఐదు నిమిషాలు లేటైనా మొత్తానికే ఆబ్సెంట్ వేస్తారని కార్మికులు చెబుతున్నారు.  డబ్బులివ్వని వారితో ఎక్కువ పని చేయిస్తారని ఆరోపిస్తున్నారు. కొన్నేళ్ళుగాఎస్ఎఫ్ఏలపై కార్మికుల నుంచి ఆరోపణలు వస్తున్నా... బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ సహా ఎవరూ పట్టించుకోవట్లదేని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కార్మికుల జీతాల్లోనే కాదు... రిటైర్డ్ అయిన వారికి వచ్చే ఫించన్లను కూడా ఎస్ఎఫ్ఏలు వదలడం లేదన్న ఆరోపణలున్నాయి. అల్వాల్ కి చెందిన ఈ కార్మికురాలు కొన్నిరోజుల క్రితం యాక్సిడెంట్ లో గాయపడింది. తనకు  వచ్చిన డబ్బులు కూడా సూపర్ వైజర్ నొక్కేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

 

రెండు నిమిషాలు ఆలస్యమైనా ఆబ్సెంట్ వేస్తుండ్రు

సూపర్ వైజర్ల ఆగడాలు ఇలా ఉంటే... టెక్నాలజీ అమలులో భాగంగా కార్మికులకు అధికారులు కూడా అన్యాయం చేస్తున్నారు.  డ్యూటీ టైమ్ కి రెండు నిమిషాలు లేటైనా, బయో మెట్రిక్ లో ఫింగర్ పడకపోయినా, పండగలు, ఆదివారాల్లో రెండు పూటలా హాజరు తీసుకోకున్నా.. డ్యూటీకి రానట్టుగా గుర్తించి వేతనాల్లో కోత పెడుతున్నారు. శానిటేషన్ విభాగంలో అవినీతికి చెక్ పెట్టేందుకు ఈమధ్యే మెడికల్ ఆఫీసర్లపై  చర్యలు తీసుకున్నారు. అయినా అధికారుల అక్రమాలు మాత్రం ఆగడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.