ప్రపంచ హైడ్రోజన్ సదస్సును ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్‌తో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ దేశాల ప్రతినిధులు సమావేశమయ్యే ప్రతిష్టాత్మక కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ప్రతినిధులు ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు.
నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్‌లో మే 13 నుంచి 15 వరకు వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024 జరిగింది. ఇందులో భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ పాలసీకి సంబంధించి సొంత పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో అతి పెద్ద పెవిలియన్లలో ఇదీ ఒకటి.
భారతదేశం తరఫున నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రైల్వే మంత్రిత్వశాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ ప్రైవేట్ రంగ సంస్థలు పాల్గొన్నాయి.