అక్టోబర్లో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలోని న్యూజెర్సీలో అక్టోబర్‌ 8వ తేదీన ప్రారంభం కానుంది. న్యూజెర్సీ రాష్ట్రంలోని రాబిన్స్‌విల్లే టౌన్ షిప్ లో బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ దేవాలయం నిర్మాణ పనులు 12 ఏళ్ల తర్వాత పూర్తయ్యాయి.

అమెరికా వ్యాప్తంగా తరలివచ్చిన 12 వేల మంది కార్యకర్తలు ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 183 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీని నిర్మాణానికి 2011 నుంచి 2023 వరకు సుమారు 12 ఏళ్లు పట్టింది. సుమారు 10 వేల విగ్రహాలను ఇందులో ఉపయోగించారు.

కంబోడియాలోని 12వ శతాబ్ధం నాటి అంగ్‌కోర్‌ వాట్‌ హిందూ ఆలయం తర్వాత ఇదే అతిపెద్ద దేవాలయం అంటున్నారు. ఆలయాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

ఆధునిక యుగంలో భారత్‌ వెలుపల నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే అంటున్నారు. సువిశాల అక్షర్‌ధామ్‌ ఆలయంలో పురాతన భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా 10 వేల విగ్రహాలు, సంగీత వాయిద్య పరికరాలు, నృత్యరూపాల శిల్పాలను అద్భుతంగా చెక్కారు.

18వ తేదీ నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. కంబోడియాలోని ఆంకోర్‌ వాట్‌ తర్వాత ఇది రెండో అతిపెద్ద హిందూ ఆలయం. ఈ ఆలయాన్ని బీఏపీఎస్‌ అధ్యాత్మిక అధిపతి మహంత్‌ స్వామి మహరాజ్‌ ఆధ్వర్యంలో అక్టోబరు 8న లాంచనంగా ప్రారంభించనున్నట్లు బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ సంస్థకు చెందిన అక్షర్‌వత్సలదాస్‌ వెల్లడించారు.