లెక్క మారింది..రసవత్తరంగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు

  • టాప్ ప్లేస్‌‌లోకి సౌతాఫ్రికా
  • రెండో ప్లేస్‌‌లో ఆసీస్‌‌..మూడో స్థానంలో ఇండియా

(వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌) : వరుసగా మూడోసారి వరల్డ్ టెస్టు చాంపియన్‌‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరాలని భావిస్తున్న టీమిండియా బోర్డర్‌‌‌‌–గావస్కర్ ట్రోఫీ పింక్ టెస్టులో బోల్తా కొట్టడంతో  రేసులో వెనుకబడింది.  అదే సమయంలో స్వదేశంలో  2-–0తో శ్రీలంకను ఓడించిన సౌతాఫ్రికా ఒక్కసారిగా టాప్ ప్లేస్‌‌కు దూసుకొచ్చింది. ఇప్పటిదాకా ఐదు జట్ల మధ్య ఉన్న పోటీని  కాస్త  మూడు జట్ల రేసుగా మార్చింది. సఫారీలతో పాటు  ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ బెర్తు కోసం పోటీలో మిగిలాయి.

3–0తో ఇండియాను వైట్‌‌వాష్ చేసిన తర్వాతస్వదేశంలో ఇంగ్లండ్‌‌ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోవడంతో న్యూజిలాండ్ ఆశలు ఆవిరయ్యాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో హాట్ ఫేవరెట్‌‌గా మారిన  సౌతాఫ్రికాతో ఇప్పుడు ఆస్ట్రేలియా,  ఇండియా మధ్య నాకౌట్ లాంటి పోరు కనిపిస్తోంది. ఈ మూడు జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం!

ఇండియాకు చావోరేవో 

ఈ సైకిల్‌‌లో దాదాపు ఏడాది వరకూ అగ్రస్థానంలో కొనసాగిన ఇండియా తమ చివరి ఐదు టెస్టుల్లో నాలుగింటిలో (న్యూజిలాండ్‌‌తో 3, ఆస్ట్రేలియాతో1) ఓడిపోయి మూడో స్థానానికి పడిపోయింది.  మన జట్టుకు మరో మూడు టెస్టులే మిగిలున్నాయి. ఫైనల్ చేరాలంటే బోర్డర్‌‌–‌‌-గావస్కర్ ట్రోఫీలోని ఈ మూడు మ్యాచ్‌‌ల్లో రెండింటిలో గెలిచి.. ఒకదాన్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.  ఒకవేళ ఇండియా 2-–1తో ఈ సిరీస్ నెగ్గినా ఆసీస్‌‌కే చాన్స్‌‌ ఉంటుంది. లంకను 2-–0తో ఓడిస్తే  ఆసీస్‌‌, పాకిస్తాన్‌‌తో ఆడే రెండు టెస్టుల్లో  ఓ మ్యాచ్‌‌ నెగ్గితే సౌత్రాఫికా ఫైనల్ చేరుతాయి.

బోర్డర్‌‌–‌‌-గావస్కర్ ట్రోఫీ 2–-2తో సమం అవ్వడంతోపాటు   ఆసీస్‌‌, లంక సిరీస్‌‌ కూడా డ్రా అయితే  ఇండియా, ఆస్ట్రేలియా చెరో 55.26 పీటీసీతో సమంగా నిలుస్తాయి. అప్పుడు ఎక్కువ సిరీస్‌‌ విజయాలు సాధించిన కారణంగా ఇండియానే ముందంజ వేస్తుంది. కానీ, లంకతో సిరీస్‌‌లో ఆసీస్‌‌ 8 కంటే ఎక్కువ పాయింట్లు సాధిస్తే టీమిండియా కంటే ఆ జట్టే ఎక్కువ పీటీసీతో నిలుస్తుంది. ఏదేమైనా  బోర్డర్‌‌‌‌ గావస్కర్ ట్రోఫీలో  ఏ మార్జిన్‌‌తో ఓడినా రోహిత్‌సేన ఇంటిదారి పట్టాల్సిందే. 

ఆస్ట్రేలియాకు మొగ్గు

పింక్ టెస్టులో ఇండియాపై విక్టరీ తర్వాత టాప్ ప్లేస్‌‌కు వచ్చిన ఆస్ట్రేలియా ఒక్క రోజులోనే ఆ ప్లేస్‌‌ను సౌతాఫ్రికాకు కోల్పోయింది. ఆసీస్‌‌కు ఇంకా ఐదు టెస్టులు (ఇండియాతో 3, శ్రీలంకలో 2) మిగిలున్నాయి. బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీలో ఇండియాపై రెండు విజయాలు సాధిస్తే.. శ్రీలంకతో సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఆ టీమ్ ఫైనల్ బెర్తును ాయం చేసుకుంటుంది. ఒకవేళ ఇండియాతో సిరీస్‌‌ 2–2తో డ్రా అయితే శ్రీలంకపై కనీసం ఒక్క టెస్టులో అయినా నెగ్గాల్సి ఉంటుంది.  అప్పుడు సౌతాఫ్రికా ఫలితాలపై ఆధారపడకుండా ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ బోర్డర్‌‌‌‌–గావస్కర్ ట్రోఫీని 2–3తో కోల్పోయినా  శ్రీలంకపై 2–0తో గెలిస్తే కూడా ఆసీస్‌‌ ముందంజ వేస్తుంది.  

మరోవైపు సౌతాఫ్రికా చేతిలో వైట్‌‌వాష్ తర్వాత  శ్రీలంక అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. అయితే, ఆస్ట్రేలియాను 2–0తో ఓడిస్తే ఆ టీమ్ 53.85 పీటీసీతో నిలుస్తుంది. అయినా లంక ఫైనల్ చేరాలంటే పాకిస్తాన్ చేతిలో సౌతాఫ్రికా రెండు టెస్టుల్లో  ఓడాలి.  లేదంటే ఒకదాంట్లో నెగ్గి, మరో దాన్ని డ్రా చేసుకోవాలి. అదే సమయంలో బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీని ఆసీస్‌‌ 2–1తో నెగ్గాల్సి ఉంటుంది. 

సఫారీలకు మెండుగా..

ప్రస్తుత డబ్ల్యూటీసీలో సౌతాఫ్రికా అనూహ్యంగా రేసులోకి దూసుకొచ్చింది. తమ తొలి ఐదు టెస్టుల్లో ఒక్కదాంట్లోనే నెగ్గిన సఫారీ టీమ్ గత ఐదు మ్యాచ్‌‌ల్లోనూ విజయం సాధించి  63.33 పీటీసీతో పట్టికలో అగ్రస్థానం అందుకుంది. ఈ నెల 26నుంచి స్వదేశంలో పాకిస్తాన్‌‌తో రెండు టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా ఒక్కదాంట్లో గెలిస్తే నేరుగా లార్డ్స్‌‌లో  జరిగే ఫైనల్‌‌కు రెడీ అవుతుంది. రెండింటిలో నెగ్గితే టాప్ ప్లేస్‌‌ కైవసం చేసుకుంటుంది.

ALSO READ : Temba Bavuma: కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అద్భుతం.. టెస్ట్ క్రికెట్‌లో దూసుకెళ్తున్న బవుమా

ఒకవేళ పాక్‌‌తో రెండు మ్యాచ్‌‌ల్లోనూ ఓడితే మాత్రం మూడో ప్లేస్‌‌కు పడిపోయి ఫైనల్ బెర్తు కోల్పోనుంది. ఈ సైకిల్‌‌లో ఇతర జట్లతో పోలిస్తే సౌతాఫ్రికా తక్కువ టెస్టులు ఆడుతోంది. కాబట్టి గెలుపు, ఓటములు ఆ టీమ్ పీటీసీని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.