మద్యం మత్తులో ఓ యువకుడు పోలీస్గల్లా పట్టుకున్న సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన నాగరాజు మద్యం సేవించాడు.
అనంతరం రోడ్డుపై అటుగా వెళ్తున్న ఓ కారును బలవంతంగా ఆపి వాటి అద్దాలు పగలగొట్టి వీరంగం సృష్టించాడు. కారులో ఉన్న వారిని భయబ్రాంతులకు గురి చేశాడు. దీంతో ప్రయాణికులు పోలీసుకులకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో యువకుడు బూతులు మాట్లాడుతూ.. హెడ్ కానిస్టేబుల్ గల్లా పట్టుకున్నాడు. ఈ ఘటనతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అతన్ని అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.