పెళ్లి కావడంలేదని యువకుడి సూసైడ్

తాడ్వాయి, వెలుగు : తనకు పెళ్లి కావడం లేదని మండల కేంద్రంలో ఓ యువకుడు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడ్వాయికి చెందిన జవడి శ్రీకాంత్(26 )కి రెండేళ్ల క్రితం పెళ్లి సంబంధం కుదిరింది. కాగా అది కొద్ది రోజులకే చెడిపోయింది. అనంతరం చాలా సంబంధాలు చూసినా సెట్ కాకపోవడంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్ గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు.

మృతుడి తల్లి గతంలోనే చనిపోయిందని, తండ్రి బాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు