ప్రియురాలు లవ్ ​రిజెక్ట్ చేసిందని యువకుడు సూసైడ్​

తాడ్వాయి, వెలుగు: ప్రియురాలు లవ్ రిజెక్ట్ చేసిందని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన పులి మాదారి సమ్మయ్య కొడుకు క్రాంతి(25) కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. మృతుడి తల్లి కొన్నేండ్ల కింద అనారోగ్యంతో చనిపోయింది. ఇద్దరూ అక్కలకు పెండ్లిళ్లు అయ్యాయి. తండ్రి, కొడుకు ఇద్దరే ఉంటున్నారు. 

కొంతకాలంగా కాంత్రి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.

 కొద్దిరోజుల కింద ఆమె ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెందాడు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో అతడు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సమ్మయ్య ఇంటికి వచ్చి చూసేసరికి కొడుకు ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. స్థానికులను పిలిచి కిందకు దించి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి సమ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.