జస్ట్ మిస్.. లేకుంటే అంతే సంగతి: 14వ అంతస్తు నుండి దూకబోయిన యువకుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

జస్ట్ మిస్.. లేకుంటే అంతే సంగతి: 14వ అంతస్తు నుండి దూకబోయిన యువకుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

లక్నో: 14వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.. బాల్కనీ నుండి కిందికి దూకేందుకు ప్రయత్నిస్తుండగా చివరి క్షణంలో స్థానికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‎లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సూపర్‌టెక్ కేప్ టౌన్ సొసైటీలో నివాసం ఉంటున్న ఓ యువకుడు గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.

 ఇటీవల ఆరోగ్యం అస్సలు సహకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం (అక్టోబర్ 21) అపార్ట్ మెంట్ 14వ అంతస్తు నుండి దూకేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే యువకుడిని రక్షించారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. అతను దీర్ఘకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

 యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు 14వ అంతస్తు నుండి దూకేందుకు ప్రయత్నించడం.. స్థానికులు చివరి నిమిషంలో వెళ్లి రక్షించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ‘‘జస్ట్ మిస్.. లేకుంటే అంతే సంగతి’’ అని కొందరు.. ‘‘మనోడికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి’’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.