ఇందల్వాయి ఎస్ఐ మహేశ్​పై కేసు

ఇందల్వాయి ఎస్ఐ మహేశ్​పై కేసు
  • పెండ్లి పేరుతో మోసం చేశాడని యువతి కంప్లయింట్​ 

నిజామాబాద్, వెలుగు : పెండ్లి చేసుకుంటానని యువతిని మోసగించిన కేసులో ఇందల్వాయి ఎస్ఐ మహేశ్​పై బుధవారం కేసు నమోదైంది. కామారెడ్డికి చెందిన ఓ యువతి ఫేస్​బుక్​లో పరిచయం కాగా మహేశ్ ​పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరూ కలిసి హైదరాబాద్​తో పాటు చాలాచోట్ల తిరిగారు. పెండ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా దాటవేస్తుండడంతో అనుమానించిన సదరు యువతి ఆదివారం రాత్రి మహేశ్​పనిచేసే స్టేషన్​కు వచ్చి బైఠాయించింది.

సిబ్బంది సూచన మేరకు వెళ్లిపోయిన ఆమె మరుసటి రోజు సీపీ కల్మేశ్వర్​ను కలిసి కంప్లయింట్​ఇచ్చింది. అప్పటికే ఎస్ఐ మహేశ్​​గవర్నమెంట్​సిమ్​కార్డును ఠాణాలో అప్పగించి లీవ్​లో వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్బీ ఆఫీసర్​తో సీపీ విచారణ చేయించగా అంతా నిజమేనని తేలింది. దీంతో ఎస్ఐగా పనిచేస్తున్న స్టేషన్​లోనే మహేశ్​పై కేసు నమోదు చేశారు.