లైట్ వేయమన్నందుకు అన్నను చంపిన తమ్ముడు

లైట్ వేయమన్నందుకు అన్నను చంపిన తమ్ముడు

బాన్సువాడ, వెలుగు: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ శివారులోని దాల్మల్ గుట్టలో లైట్  వేయమన్నాడనే చిన్న కారణంతో అన్నను హత్య చేశాడు. బాన్సువాడ సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఒకిలి గారి కృష్ణ(35)ను తమ్ముడు రాజు హత్య చేశాడు. కృష్ణ మేస్త్రీగా పని చేసేవాడు. సోమవారం మేస్త్రీ పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు.

ఇంటి ముందు ఉన్న గచ్చులో కాళ్లు, చేతులు కడుక్కోవడానికి వెళ్లగా అక్కడ చీకటిగా ఉంది. లైట్  వేయమని తమ్ముడిని గట్టిగా పిలిచాడు. ఆ సమయంలో రాజు తన భార్యతో కలిసి భోజనం చేస్తుండడంతో తలుపు తీయడం ఆలస్యమైంది. దీంతో ఇద్దరూ ఒకరినొకరు మాటామాట అనుకొని ఘర్షణ పడ్డారు.ఆవేశంలో రాజు ఇంటిలో ఉన్న కత్తెరతో మెడ, చేతిపై పొడవగా కృష్ణ కింద పడిపోయాడు. తల్లి గంగామణి, చుట్టుపక్కల వారు బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.