షాద్‌నగర్, వెలుగు: ఆస్తి కాజేయాలన్న ప్లాన్‌తో ఓ వ్యక్తి తన అన్నను చెరువులో తోసి హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్‌కు చెందిన కేశమోని కృష్ణయ్య (52), చంద్రయ్య అన్నదమ్ములు. కృష్ణయ్య భార్య రెండేండ్ల కింద చనిపోగా, పిల్లలు లేరు. దీంతో కృష్ణయ్య ఆస్తిని కాజేయాలన్న ఉద్దేశంతో అతడిని హత్య చేసేందుకు చంద్రయ్య ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఈ నెల 7న చంద్రయ్య మద్యం తీసుకొని అన్న కృష్ణయ్య ఇంటికి వెళ్లాడు. అక్కడ మద్యం తాగిన తర్వాత క-ష్ణయ్యను బైక్‌పై ఎక్కించుకొని చెరువు వద్దకు తీసుకెళ్లి అందులో తోసేశాడు.
తర్వాత కృష్ణయ్య ఇంట్లో ఉన్న 3 తులాల బంగారం, పట్టా బుక్‌లు, రూ.31 వేలు ఎత్తుకెళ్లాడు. అయితే తన అల్లుడు కనిపించడం లేదని కృష్ణయ్య అత్త బాలమణి షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 11న కృష్ణయ్య డెడ్‌బాడీ చెరువులో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. చంద్రయ్యపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.