రయ్..రయ్ మంటూ..దూసుకెళ్లిన సైక్లిస్టులు

రయ్..రయ్ మంటూ..దూసుకెళ్లిన సైక్లిస్టులు

భారతీయ సైక్లింగ్ సమాఖ్య సహకారంతో హెచ్​సీఎల్​గ్రూప్స్​ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఐటీ కారిడార్​లో నిర్వహించిన ‘సైక్లోథాన్’ ఉత్సాహభరితంగా సాగింది. మొత్తం1,490 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. వీరిలో 224 మంది మహిళలు ఉన్నారు. కోకాపేట జంక్షన్​నుంచి మొదలైన సైక్లింగ్​కొల్లూరు జంక్షన్​వరకు సాగింది. ప్రొఫెషనల్ రోడ్ రేస్(52 కిమీ), అమెచ్యూర్ రోడ్ రేస్(52 కిమీ), అమెచ్యూర్ ఎంటీబీ రోడ్ రేస్(23 కిమీ)

అమెచ్యూర్ రోడ్ రేస్(23 కిమీ), గ్రీన్ రైడ్(10 కి.మీ) పేరుతో మొత్తం ఐదు రేస్​లు పోటాపోటీగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సైక్లోథాన్​నిర్వహించారు. ఫైనాన్షియల్​డిస్ట్రిక్ట్​లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో హెచ్‌‌‌‌సీఎల్ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్​సుందర్ మహాలింగం, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రజత్ చందోలియా, గ్లోబల్ హెడ్ పవన్ వాడపల్లి తదితరులు పాల్గొన్నారు.        

– వెలుగు, గచ్చిబౌలి