• చాలామంది రొట్టెల పిండిని చల్లని నీళ్లతో కలుపుతారు. అలా కాకుండా గోరువెచ్చని నీళ్లతో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.
• పిండి కలిపేటప్పుడు కొంచెం నూనె కూడా వేసి కలపొచ్చు.
• రొట్టెల్ని పెనం మీద కాల్చిన వెంటనే హాట్ బాక్స్ పెట్టాలి.అలా చేయకపోతే గాలి తగిలి గట్టిపడతాయి.
• పిండిని ముద్దగా కలిపిన తర్వాత సుమారు 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి. లేదంటే మొత్తం పిండి ముద్దని కొంచెంసేపు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా చేస్తే పిండి ముద్ద మెత్తగా ఉంటుంది. రొట్టెలు గుండ్రంగా కూడా వస్తాయి.