అంబేద్కర్ విద్యాసంస్థల్లో థియేటర్ యాక్టింగ్ శిక్షణా శిబిరం..ఏప్రిల్​ 10 వరకు ట్రైనింగ్​

అంబేద్కర్ విద్యాసంస్థల్లో థియేటర్ యాక్టింగ్ శిక్షణా శిబిరం..ఏప్రిల్​ 10 వరకు ట్రైనింగ్​

ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల ఆవరణలో 30 రోజుల ప్రొడక్షన్ ఓరియెంటెడ్ థియేటర్ యాక్టింగ్ శిక్షణా శిబిరం ఉత్సాహంగా కొనసాగుతోంది.  డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, కిరణాలు కల్చరల్ అసోసియేషన్ సహకారంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు విద్యతోపాటు ఇతర యాక్టివిటీస్​లో ఉన్న టాలెంట్​ను వెలికితీయడానికి ఈ ట్రైనింగ్​  నిర్వహిస్తున్నారు.

మార్చి 10న మొదలైన ఈ శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 10 వరకు  కొనసాగనున్నది. కల్చరల్ కోఆర్డినేటర్ సుంకరి నవీన్, మాస్టర్ ట్రైనర్ బిర్రు కిరణ్ నేతృతంలో విద్యా సంస్థలకు చెందిన 20 మంది స్టూడెంట్స్ శిక్షణ పొందుతున్నారు.   ప్రిన్సిపాల్ శేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కళా నైపుణ్యాన్ని వెలికితీయడానికి థియేటర్ యాక్టింగ్ శిక్షణా శిబిరం  దోహదపడు తుందన్నారు.