Pushpa 2: The Rule: పుష్ప 2 సినిమాకి వెళుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి.. లేదంటే దెబ్బలు పడతాయ్..

Pushpa 2: The Rule: పుష్ప 2 సినిమాకి వెళుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి.. లేదంటే దెబ్బలు పడతాయ్..

Pushpa 2: The Rule: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2: ది రూల్ ఈ నెల 05న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో అప్పుడే దేశ వ్యాప్తంగా పుష్ప సందడి మొదలైంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద కటౌట్లు, పాలాభిషేకాలు,  పూల దండలు అంటూ హడావిడి చెయ్యడానికి ఆడియన్స్, ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. 

అయితే పుష్ప2 సినిమా చూడటానికి వెళ్లేముందు కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ యాజమాన్యాలు అభిమానులకి సూచిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా హీరోల కటౌట్లు కట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారని అంటున్నారు. అలాగే థియేటర్ లోకి పేపర్లు, పేలుడు పదార్థాలు(టపాసులు) విజిల్స్, తిను బండారాలు వంటివి తీసుకెళ్లకూడదని సూచిస్తున్నారు.

పేలుడు పదార్థాల వలన అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, పేపర్లు ఎక్కువగా చల్లడం వలన మెయింటెనెన్స్ సమస్య ఉంటుందని కాబట్టి వీటిని అనుమతించమని చెబుతున్నారు. ఇక సినిమా స్టార్ట్ అయిన తర్వాత సెల్ఫోన్స్ ని ఉపయోగించవద్దని, ఒకవేళ ఉప్పాయోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే థియేటర్ లో సెల్ ఫోన్ ఉపయోగించడంవలన పైరసీ బారినపడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

ఇక సినిమా ప్రసారం అవుతున్న సమయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ స్క్రీన్  దగ్గరికి వెళ్లి రచ్చ చెయ్యడం, ఇతర ప్రేక్షకులకి ఇబ్బంది కలిగించడం వంటివి చెయ్యొద్దని చెబుతున్నారు. షో ప్రసారం చేసే సమయంలో ఇదైనా అవాంతరాలు ఎదురైతే సంయమనం పాటించాలని అలా కాకుండా థియేటర్ ఫర్నీచర్ ధ్వంసం చెయ్యడం, అద్దాలు పగల గొట్టడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2 సినిమాని హైప్ కి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా ప్రమోషన్ ఈవెంట్లు నిర్వహిచి బాగానే ప్రమోట్ చేస్తున్నారు. కాగా ఇప్పటివరకూ బీహార్ (టీజర్ లాంచ్ ఈవెంట్), చెన్నై, కేరళ, హైదరాబాద్(ప్రీ రిలీజ్ ఈవెంట్) ప్రాంతాల్లో ఈవెంట్లు నిర్వహించగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రిలీజ్ రోజే పుష్ప 2 దాదాపుగా రూ.350 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.