వేముల, నేతి విద్యాసాగర్ ని కలిసిన తీన్మార్ మల్లన్న

నకిరేకల్,( వెలుగు) :  ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ను ఆదివారం నకిరేకల్ లో తీన్మార్ మల్లన్న వారి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న సందర్భంగా తీన్మార్ మల్లన్న వారిని కలిసి శాలువాతో సత్కరించారు. ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని మల్లన్న కోరారు.