కాచిగూడలో భారీ చోరీ..దంపతులకు మత్తుమందు ఇచ్చి కేజీ గోల్డ్, రూ.70 లక్షలు ఎత్తుకెళ్లిన పనిమనుషులు

కాచిగూడలో భారీ చోరీ..దంపతులకు మత్తుమందు ఇచ్చి కేజీ గోల్డ్, రూ.70 లక్షలు ఎత్తుకెళ్లిన పనిమనుషులు

హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడి జరిగింది.  వ్యాపారవేత్త హేమరాజు ఇంట్లో కేజీ బంగారం, రూ.70లక్షల నగదు ఎత్తుకెళ్లారు.  ఇంట్లో ఉండే పని మనుషులు  హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న  దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.  సృహ కోల్పోయిన వెంటనే ఇంట్లో ఉన్నబంగారు ఆభరణాలు,నగదును ఎత్తుకెళ్లారు. 

ఉదయం వాకింగ్ కి  రాకపోవడంతో.. తన స్నేహితుడు ఇంటికి వచ్చి చూసే సరికి  ఇంట్లో అపస్మార్క స్థితిలో పడి ఉన్నారు హేమరాజు దంపతులు. వెంటనే చికిత్స కోసం హైదర్ గూడా లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. స్నేహితుడి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లిన నేపాలి దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.