
మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడిలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయానికి ఉన్న రెండు ప్రధాన ద్వారాల తాళాలు పగలగ్గొట్టి దేవాలయంలోకి చొరబడిన దుండగులు.. ఆలయంలోని సుమారు లక్షన్నర విలువ గల బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అమ్మవారి ముక్కుపుడక, శతగోపం, పళ్లెం, కిరటాలు తదితర వస్తువులను చోరీ చేశారు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గమనించి దేవాలయ అర్చకులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చోరీపై ఆరా తీశారు. ఆలయంలో చోరీ జరగడం.. ఏకంగా అమ్మవారి ఆభరణరాలను ఎత్తుకెళ్లడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.